ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని రాష్ట్ర విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లవద్దని సూచించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఇవి చదవండి: