ETV Bharat / state

Nara Bhuvaneswari Nijam Gelavali Bus Yatra: బాబు అరెస్టుతో గుండెపగిలిన అభిమాన కుటుంబాలకు భువనమ్మ భరోసా.. 'నిజం గెలవాలి' యాత్ర షురూ - Nijam Gelavali

Nara Bhuvaneswari Nijam Gelavali Bus Yatra Started: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి 'నిజం గెలవాలి' బస్సు యాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ యాత్రలో భాగంగా... చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతిచెందిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి బాధిత కుటుంబీకులను భువనేశ్వరి పరామర్శించారు.

nara_bhuvaneshwari_nijam_gelavali_bus_yatra

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 1:05 PM IST

Updated : Oct 25, 2023, 1:42 PM IST

Nara Bhuvaneswari Nijam Gelavali Bus Yatra: బాబు అరెస్టుతో గుండెపగిలిన అభిమాన కుటుంబాలకు భువనమ్మ భరోసా.. 'నిజం గెలవాలి' యాత్ర షురూ

Nara Bhuvaneswari Nijam Gelavali Bus Yatra Started: టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన 'నిజం గెలవాలి' బస్సుయాత్ర తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైంది. నారావారిపల్లెలో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించిన భువనేశ్వరి.. 'నిజం గెలవాలి' పేరిట ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక చంద్రగిరిలో ఎ.ప్రవీణ్‌రెడ్డి, నేండ్రగుంటలో చిన్నబ్బ మరణించగా.. వారి కుటుంబాలను ఆమె పరామర్శించారు. ఈ క్రమంలో బాధిత కుటుంబాలను ఓదార్చిన భువనేశ్వరి.. రూ.3 లక్షలు చొప్పున చెక్కులు అందజేశారు. మధ్యాహ్నం అగరాలలో 'నిజం గెలవాలి' కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు.

Start From Today: ఈ యాత్రలో భాగంగా.. రాష్ట్రంలో చంద్రబాబు అరెస్ట్‌తో ఆవేదన చెంది మరణించిన తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానుల ఇళ్లకు వెళ్లి నేటి నుంచి బాధిత కుటుంబీకులను భువనేశ్వరి పరామర్శించనున్నారు. ఈ యాత్రలో భాగంగా పరామర్శలతో పాటు సభలు, సమావేశాల్లో భువనేశ్వరి పాల్గొని.. చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కిన ప్రజలకు ధన్యవాదాలు తెలపనున్నారు. మొదట రాయలసీమ జిల్లాల్లో ఈ పర్యటన సాగనుంది. చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని, అసత్య ఆరోపణలతో జైల్లో పెట్టారనే విషయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లి పోరాటాన్ని ఉద్ధృతం చేసే దిశగా.. 'నిజం గెలవాలి' (Nijam Gelavali) కార్యక్రమం సాగనుంది.

Nara Bhuvaneshwari Visit to Tirumala: రేపటినుంచి 'నిజం గెలవాలి' బస్సుయాత్ర.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

TDP Yatra: దాదాపు 47రోజులుగా జైల్లో ఉంటున్న చంద్రబాబుకు మద్దతుగా(Protests on Chandrababu Arrest) రోడ్డెక్కిన ప్రజలకు, ఆయా వర్గాల వారికి భువనేశ్వరి ధన్యవాదాలు తెలపనున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ధైర్యం చెప్పడంతోపాటు అండగా ఉంటామంటూ భరోసా ఇవ్వనున్నారు. ఇవాళ చంద్రగిరి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో భువనేశ్వరి పాల్గొంటారు. అలాగే గురువారం తిరుపతి, శుక్రవారం శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో కార్యక్రమం సాగనుంది.

Chandragiri Constituency: యాత్రకు ముందు తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకున్నారు (Bhubaneswari Visited Tirumala Temple). తర్వాత స్వగ్రామం నారావారిపల్లెలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు పెట్టిన ఆమె.. చంద్రబాబు లేకుండా తొలిసారి తిరుమల వెళ్లానని.. ఈ ప్రయాణం భారంగా ఉందని తెలిపారు.

Nara Bhuvaneshwari, Lokesh Fire on Punganur Incident: పుంగనూరు ఘటనపై భువనేశ్వరి, లోకేశ్ ఆగ్రహం..రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనం

Bus Yatra : ఎప్పుడూ కుటుంబ సభ్యులతో ఊరు వచ్చే తాను.. చంద్రబాబు జైల్లో ఉన్న కారణంగా ఒంటరిగా నారావారిపల్లె వెళ్లానని తెలిపారు. ఈ ప్రయాణం తనకు ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నిమిషం భారంగా గడిచిందన్న భువనేశ్వరి.. ఆ ఏడుకొండల వాడి దయతో, మా ఊరు నాగాలమ్మ తల్లి కృపతో, ప్రజల మద్దతుతో.. నిజం గెలుస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే చంద్రగిరిలో తొలి అడుగు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Nijam Gelavali Yatra: మరోవైపు చంద్రబాబు అరెస్టుతో నిలిచిన 'బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమాన్ని(Babu Surety Bhavishyathuku Gurantee Program) నవంబరు 1నుంచి లోకేశ్ పునరుద్ధరించనున్నారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు..(Super Six Schemes) జనసేన(Janasena) చేసిన సిఫార్సులను జోడించి నవంబర్ 1 న ఐక్య కార్యాచరణ ప్రకటించి, ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు బయటకు వచ్చేవరకు లోకేశ్ ఈ కార్యక్రమాన్ని కొనసాగించనుండగా మిగిలిన నేతలు డిసెంబరు 15వరకు చేపడతారు. బాబు జైలు నుంచి బయటకు వచ్చాక యువగళం పాదయాత్ర ను ఆపేసిన చోటనుంచి ప్రారంభిస్తారు.

Nara Bhuvaneshwari Fires on AP Government: టీడీపీ శ్రేణులు నన్ను కలవకూడదని చెప్పడానికి ప్రభుత్వానికి హక్కెక్కడిది : నారా భువనేశ్వరి

Last Updated : Oct 25, 2023, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.