ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్​ను మద్యాంధ్రప్రదేశ్​గా మార్చారు: కిరణ్ రాయల్

janasena leader Kiran Royal fires on jagan mohan reddy: రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్​చార్జ్ కిరణ్ రాయల్ ధ్వజమెత్తారు. పెట్టుబడులు పెట్టేవాళ్లకు నో సిగ్నల్‍ అంటుందని, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్​గా మార్చారని ఎద్దేవా చేశారు.

కిరణ్ రాయల్
janasena leader kiran rayal
author img

By

Published : Dec 3, 2022, 7:18 PM IST

janasena leader Kiran Royal fires on jagan mohan reddy : రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం... పెట్టుబడులు పెట్టేవాళ్లకు నో సిగ్నల్‍ అంటుందని జనసేన నాయకుడు కిరణ్‍ రాయల్‍ ఆరోపించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక వేత్తలు కొత్త పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావడం లేదన్నారు.

ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్​గా మార్చారని ఎద్దేవా చేశారు. తితిదే పాలకమండలి సభ్యుడిగా ఉన్న బూదాటి లక్ష్మీనారాయణ ఆర్థిక నేరగాడని తాము ముందే చెప్పామని ఆయన తెలిపారు. అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోలేదని.. కానీ ఇప్పుడు లక్ష్మీనారాయణ బాగోతం బయటపడిందన్నారు. తితిదే పాలకమండలిలో ఉన్న ఆర్థిక నేరగాళ్ళను బర్తరఫ్‍ చేయాలని డిమాండ్‍ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.