ETV Bharat / state

విద్యార్థులకు టోల్​గెేట్​ సిబ్బందికి వివాదం.. కార్లపై దాడి చేసిన సిబ్బంది.. - కార్లపై దాడి

Dispute: తిరుపతి జిల్లా వడమల పేట టోల్​గేట్ వద్ద తమిళనాడుకు చెందిన లా కళాశాల విద్యార్థులకు టోల్​గేట్ సిబ్బందికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో నాలుగు కార్లను టోల్​గేట్ సిబ్బంది ధ్వంసం చేశారు. విద్యార్థులకు సిబ్బందికి మధ్య మాట మాట పెరగడంతో వివాదం ముదిరింది. చివరికి పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. అసలు వివాదానికి కారణం ఎంటంటే..

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Oct 22, 2022, 6:37 PM IST

టోల్​గేట్​ సిబ్బందికి విద్యార్థులకు మధ్య వివాదం

Dispute Between Tollgate staff And Students: తమిళనాడుకు చెందిన సుమారు 70 మంది విద్యార్థులు తిరుపతిలోని లా కళాశాలలో పరీక్షలు రాస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం పరీక్షలు రాసిన ఓ విద్యార్థి వడమల పేట టోల్​గేట్ వద్దకు చేరుకున్నాడు. టోల్ ఛార్జీలు చెల్లించకుండానే తనను పంపాలని అతను సిబ్బందితో అన్నాడు. కుదరదని సిబ్బంది చెప్పడంతో వాగ్వాదానికి దిగాడు. ఈ నేపథ్యంలో మాట మాట పెరిగి లా విద్యార్థి, సిబ్బంది దాడి చేసుకున్నారు.

దీంతో వెనుక వస్తున్న విద్యార్థులందరూ అక్కడకు చేరుకున్న తర్వాత.. టోల్​గేట్ వద్ద తమను ఉచితంగా పంపాలని ఘర్షణకు దిగారు. అలా కుదరదని సిబ్బంది తెలిపారు. ఈ నేపథ్యంలో సిబ్బంది, విద్యార్థుల మధ్య మాట పెరిగింది. దీంతో సిబ్బంది విద్యార్థులకు చెందిన నాలుగు కార్లపై దాడి చేశారు. ఈ ఘర్షణతో తిరుపతి చెన్నై జాతీయ రహదారిపై ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. వడమాల పేట ఎస్సై రామాంజనేయులు సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన వివరాల పై ఆరా తీశారు. అనంతరం ఇరు వర్గాలకు నచ్చచెప్పటంతో వివాదం సద్దుమణిగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.