ETV Bharat / state

ఆ భయంతోనే.. ముఖ్యమంత్రి జగన్​ పదేపదే దిల్లీ పయనం: సీపీఐ నారాయణ - బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

CPI NARAYANA FIRES ON CM JAGAN : వైసీపీ, బీజేపీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ భయంతోనే ముఖ్యమంత్రి జగన్​ దిల్లీకి వెళ్లారని ఆయన ఆరోపించారు. మరోవైపు జగన్​తో అమిత్​ షా రాజకీయ ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. అలాగే పోలవరం నిర్వాసితులపై ఎందుకంత వివక్ష అని నిలదీశారు.

CPI NARAYANA FIRES ON CM JAGAN
CPI NARAYANA FIRES ON CM JAGAN
author img

By

Published : Mar 30, 2023, 7:55 PM IST

CPI NARAYANA FIRES ON CM JAGAN : సుప్రీంకోర్టులో మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు చివరి దశకు రావడం వల్ల.. ఆ భయంతోనే ముఖ్యమంత్రి జగన్ దిల్లీకి వెళ్లారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. వివేకా హత్య కేసు చివరి దశకు వచ్చిన తర్వాత కొత్త కమిటీని వేయడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ, బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీతో చేసుకున్న ఒప్పందం వల్ల వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు ఆలస్యం కాబోతుందని ఆయన ఆరోపించారు. కేంద్ర హెం మంత్రి అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. జగన్ సంపాదించిన అక్రమ ఆస్తుల మొత్తాన్ని కర్ణాటక ఎన్నికల్లో ఖర్చు చేయబోతున్నాడన్నారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి జగన్​ని అమిత్​ షా పావులా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలను తాను ఎక్కడా చూడలేదన్నారు.

ఏప్రిల్​ 14 నుంచి దేశవ్యాప్తంగా పాదయాత్రలు: రాష్ట్రాన్ని జగన్ స్మశానంలా మార్చాడాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్​ 14న రాజ్యాంగ రూపకర్త బీఆర్​ అంబేడ్కర్​ జయంతిని పురస్కరించుకుని మే 15 వరకు "దేశ్​ కా బచావో.. మోదీ హఠావో" పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టబోతున్నట్లు వివరించారు. ఓ వైపు మోదీ దుర్మార్గ చర్యలను ఎండగడుతూనే.. మరోవైపు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం విశదీకరిస్తూ పొలిటికల్​ ఫైట్​కు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. అటు వైసీపీ.. ఇటు బీజేపీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టడానికి సిద్ధమైనట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియజేస్తూ.. వారికి చైతన్యం కలిగించే దిశగా తమ అడుగులు సాగనున్నట్లు ఆయన తెలిపారు.

పోలవరం ఎత్తు విషయంలో తండ్రిదో మాట.. కొడుకుదో బాట: వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి పోలవరం ఎత్తు విషయంలో తీవ్ర ప్రయత్నం చేసి 147 మీటర్ల ఎత్తుకు ఒప్పించారని.. ఆ సమయంలో చాలా మంది దానిని వ్యతిరేకించారని.. తమ పార్టీ అందుకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఎత్తు తగ్గించమని అందరూ కోరితే.. రాజశేఖర్​ రెడ్డి మాత్రం ఎత్తు తగ్గించడం వల్ల ఉత్తరాంధ్రకు సరిపడా నీళ్లు పోవని.. 900 మెగా వాట్ల విద్యుత్​ ఉత్పత్తి కాదని తెలిపారన్నారు. తండ్రి ఏమో 147 మీటర్ల ఎత్తుకు ఒప్పిస్తే.. కొడుకు ఏమో 141 మీటర్ల వరకే నీళ్లు నింపుతామని ​ చెపుతున్నారని.. అదే జరిగితే కేవలం అది జలాశయం అవుతుంది కానీ.. బహుళార్థ సారక ప్రాజెక్టు కాదని తెలిపారు.

పోలవరం వస్తే.. చాలా వరకూ జలశయాలు నీటితో నిండిపోతాయన్నారు. పోలవరం నిర్వాసితుల విషయంలో కూడా జగన్​ అలసత్వం వహిస్తున్నారని విమర్శించారు. నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇప్పటికీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీసి పోలవరం బాధితులను ఆదుకోవాలని నారాయణ డిమాండ్‍ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.