ETV Bharat / state

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న చంద్రబాబు, బాలకృష్ణ

SANKRANTHI CELEBRATED IN NARAVARIPALLI: నారావారిపల్లెలో నాలుగు సంవత్సరాల తర్వాత నారా, నందమూరి కుటుంబసభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెకి సంక్రాంతి పండుగకు వచ్చి సందడి చేశారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, హీరో బాలకృష్ణ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

babu balaiah
babu balaiah
author img

By

Published : Jan 14, 2023, 8:27 AM IST

Updated : Jan 14, 2023, 10:22 AM IST

SANKRANTHI CELEBRATED IN NARAVARIPALLI: రాష్ట్రంలో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి ఇళ్ల ముందు, వీధుల్లో పెద్ద ఎత్తున భోగి మంటలు వెలిగించి... పాత వస్తువులను అందులో వేశారు. కీడు తొలగిపోవాలని కోరుకున్నారు. మంటల చుట్టూ తిరుగుతూ... ఆటపాటలతో సందడి చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నారా, నందమూరి కుటుంబసభ్యులు తమ స్వగ్రామం నారావారిపల్లెకి సంక్రాంతి పండుగకు వచ్చి సందడి చేశారు. చంద్రబాబు నాయుడు ఇంటి ముందు భోగి వేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో ముచ్చటించారు.

ఈ సందర్బంగా మాట్లాడిన చంద్రబాబు.. జగన్​ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటుక ఇటుక పేర్చి రాష్ట్రాభివృద్ధికి తాను కృషి చేస్తే... ప్రజావేదిక విధ్వంసంతో జగన్​ పాలన ప్రారంభించారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం లేకుండా పోయిందన్నారు.

తెదేపా అధికారంలోకి వచ్చాక నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఇటుకపై ఇటుక పేర్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేశా. ప్రజావేదిక విధ్వంసంతో జగన్‌ పాలన మొదలుపెట్టారు. ఉగ్రవాద తరహా విధ్వంసం సాగుతోంది. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ప్రజలపై పన్నులు, ఛార్జీల మోత మోగిస్తున్నారుయ పిల్లల భవిష్యత్తు నాశనం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కందుకూరులో ప్రభుత్వం కుట్రచేసి తొక్కిసలాటకు కారణమైంది. గుంటూరు తొక్కిసలాటలోనూ కుట్ర ఉంది.. త్వరలో బయటపడుతుంది. -చంద్రబాబు

ఇంతవరకు నా సున్నితత్వం చూశారు.. ఇకపై కఠినాన్ని చూస్తారని చంద్రబాబు ప్రకటించారు. వడ్డీతో సహా అంతా తీర్చుకుంటామన్నారు. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకుని విధులు నిర్వహిస్తే మంచిదని చంద్రబాబు తెలిపారు. పుంగనూరు కాదు 175 నియోజకవర్గాలు గెలవాలని చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొన్న చంద్రబాబు, బాలకృష్ణ

సినిమాల పండుగ : నారావారిపల్లెలో బాలకృష్ణ సందడి చేశారు. ఈ ఉదయం ఉదయపు నడక అనంతరం చంద్రబాబు నాయుడు ఇంటి ముందు వేసిన భోగి మంటలలో చలి కాచుకుని అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వీర సింహారెడ్డి సినిమా అన్ని రకాల ప్రేక్షకులు చూడదగ్గదని.. సంక్రాంతి పండుగ అంటేనే సినిమాల పండుగ అని ఆయన అన్నారు. నా ప్రేక్షక దేవుళ్ళు, ఆత్మీయులు, అభిమానులు ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రాష్ట్రం బాగుపడాలని మంచి నాయకత్వం రావాలని ఆయన ఆకాంక్షించారు.

ఇవీ చదవండి

Last Updated : Jan 14, 2023, 10:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.