Minister vs MLA on Tirumala Darshan issue: శ్రీవారి దర్శానార్థం తిరుమలకు వచ్చే శాసన సభ్యులకు తితిదే ఈవో ధర్మారెడ్డి కనీస గౌరవం ఇవ్వడం లేదంటూ... గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు చేసిన ఆరోపణపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తితిదేపై ఎమ్మెల్యే అన్నా విమర్శలు చేయడం తగదని మంత్రి అంబటి వెల్లడించారు. అదనపు దర్శన టికేట్లు కావాలని తితిదేను కోరితే ఇస్తారని అంబటి రాంబాబు అన్నారు. నేడు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తితిదే అధికారులు అంబటికి తితిదే అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసిన అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. దర్శన అనంతరం మంత్రి అంబటి రాంబాబు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాాడారు. తాను విపక్షంలో ఉన్నప్పుడు సైతం అప్పటి ఈవో తమకు కావాల్సిన దర్శన టికెట్లు ఇచ్చారని వెల్లడించారు. అప్పటి ఈవో, జేఈవోలు నా ప్రోటోకాల్ నాకు ఇచ్చారన్నారు. అన్నా రాంబాబు అలాంటి ఆరోపణలు చేయడం వంద శాతం తప్పు అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
'ఎమ్మెల్యే అన్నా రాంబాబు గారు ఎందుకు అలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. దేవుడి వద్ద అధికార, విపక్షాలంటూ తేడా లేదు. చిన్న చిన్నగా ఒక్కరిద్దరు తక్కువ అవ్వడం వల్ల అలాంటి ఆరోపణలు చేయడం తప్పు. నేను విపక్షంలో ఉన్నప్పుడు నన్ను మంచిగానే మర్యాదించారు. ఇప్పుడు అలాగే మర్యాదిస్తున్నారు.'- అంబటి రాంబాబు, మంత్రి
శ్రీవారి దర్శానార్థం తిరుమలకు వచ్చే శాసన సభ్యులకు తితిదే ఈవో ధర్మారెడ్డి కనీస గౌరవం ఇవ్వకుండా అగౌరవ పరుస్తున్నారని ఈవో, అధికారులు శాసన సభ్యులకు గౌరవం ఇచ్చే స్థితిలో లేరని గిద్దలూరు ఎమ్మేల్యే అన్నా రాంబాబు ఆరోపించారు. సామాన్య భక్తులను ఒక బూచిగా చూపించి తితిదే ఈవో, ఇస్థానుసారంగా వ్యవహరిస్తున్నాడని, సామాన్య భక్తుల కోసం పారదర్శంగా పనిచేస్తే తాము కూడా స్వాగతిస్తామన్నారు. తాను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి దర్శనం కోసం సిఫార్సుపై జనరల్ కోటాలో దర్శనం కల్పించాడన్నారు. తితిదే ఈవో గూర్చి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని, తితిదే ఈవో లాంటి కొందరు చేసే పనులకు ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యేలు అసంతృప్తి కలుగుతుందని అన్నా రాంబాబు ఆరోపించారు.
'గతంలో శాసన సభ్యులుకు గౌరవం ఉండేది. కానీ ఇప్పడున్న ఈవో, అధికారులు ఒంటేద్దు పోకడ పోతున్నారు.ఈవో ఓ ఉద్యోగి అని గుర్తుంచుకోవాలి. సామాన్యులకు సేవల పేరుతో ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహారిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యలయం నుంచి లేఖ తెచ్చినా వారి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు. ఈవోకు బోర్టు అంటే గౌరవం లేదు. ఈ అంశంపై సీఎంగారి దృష్టికి తీసుకెళ్తాను. ఈవోకు కనీసం ఎమ్మెల్యేలంటే గౌరవం లేదు'.- గిద్దలూరు ఎమ్మేల్యే అన్నా రాంబాబు
ఇవీ చదవండి: