ETV Bharat / state

ఈ ఏసీపీ రూటే సపరేటు.. రూ.60 కోట్ల భూమి రూ.30 లక్షలకు డీల్‌

ACP Illegal Land Corruption: అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న వారికి బుద్ధి చెప్పాల్సిన ఓ పోలీసు అధికారి.. కబ్జాదారుతో చేతులు కలిపి రూ.60 కోట్ల విలువైన భూమిని ఇతరులకు కట్టబెట్టే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, తాను కొనుగోలు చేసిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడంటూ.. ఫిర్యాదు చేయడానికి వస్తే.. ఫిర్యాదుదారుడి నుంచి రూ.5 లక్షల రూపాయలను వసూలు చేశాడు. చివరికి అసలు విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది.

ACP deal
ACP deal
author img

By

Published : Feb 13, 2023, 12:28 PM IST

ACP Illegal Land Corruption: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌‌లోని రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఏసీపీగా విధులు నిర్వర్తిసున్న ఓ పోలీసు అధికారి.. ఓ ఎన్‌ఆర్‌ఐకి చెందిన రూ.60 కోట్ల విలువైన భూమిని ఇతరులకు కట్టబెట్టేందుకు.. కబ్జాదారుతో చేతులు కలిపి రూ.30 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నాడు. కబ్జాదారుడు.. నకిలీ పత్రాలను సృష్టించే పనిలో ఉండగా, దానికి ఇంకొంత సమయం పట్టేట్టు ఉందని గమనించిన ఏసీపీ.. ఆ పని పూర్తయ్యేలోగా ఆ జాగాలోకి ఎన్‌ఆర్‌ఐను అడుగుపెట్టకుండా చేయడం ప్రారంభించాడు. ఇంతలోనే అసలు విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో కథ అడ్డం తిరిగింది.

అసలు ఏం జరిగిదంటే: రాచకొండ పరిధిలోని ప్రాంతంలో ఓ ఎన్‌ఆర్‌ఐ రెండు దశాబ్దాల క్రితం 9.14 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిపై ఎన్నాళ్లుగానో కన్నేసిన ఓ వ్యక్తి.. అక్కడ బౌన్సర్లను పెట్టాడు. అదేంటని ఎన్‌ఆర్‌ఐ అతడిని ప్రశ్నించగా.. ఆ భూమి తమదేనంటూ దబాయించాడు. కబ్జాకు సహకరించాలని కబ్జాదారుడు.. అక్కడ విధులు నిర్వర్తిసున్న ఏసీపీని సంప్రదించాడు. దీంతో ఆ భూమిలో ఎన్‌ఆర్‌ఐ అడుగుపెట్టకుండా చూసేందుకు కబ్జాదారుడితో.. ఏసీపీ రూ.30 లక్షలకు డీల్‌ కుదుర్చుకున్నాడు.

ఇంతలోనే తాను కొనుగోలు చేసిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేశాడంటూ.. ఆ ఏసీపీనే కలిసి ఎన్‌ఆర్‌ఐ ఫిర్యాదు చేశాడు. దీంతో కబ్జాదారుడిని ఆ భూమి దరిదాపుల్లో లేకుండా చేస్తానని, ఇక ఆ భూమి జోలికి అతడు రాడని నమ్మించి.. ఎన్‌ఆర్‌ఐ వద్ద నుంచి రూ.5 లక్షలు వసూలు చేశాడు. వివిధ వర్గాల ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం తెలిసి అంతర్గతంగా దర్యాప్తు చేయించారు. అంతా వాస్తవమేనని తేలడంతో ఏసీపీని సస్పెండ్‌ చేస్తామని వారు హెచ్చరించారు. దాంతో కబ్జాదారు, అతడి బౌన్సర్లు ఎవరూ అక్కడ లేకుండా ఏసీపీ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

గతంలోనూ ఇదే తీరు: ఈ ఏసీపీ రూటే సపరేటని తెలిసింది. గతంలోనూ అనేక ఆరోపణలు రాగా.. ఉన్నతాధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. నెలవారీగా వాటాలివ్వాలని కిందిస్థాయి అధికారిని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం. తనకు సహకరించని కింది స్థాయి అధికారులను వేధిస్తారని తెలిసింది.

‘మీ ప్రాంతంలో ఇసుక లభ్యత ఎక్కువగా ఉంది.. నాకు ఎంతిస్తావో చెప్పు’’ అంటూ ఇటీవల ఒక ఇన్‌స్పెక్టర్‌ను గదమాయించినట్లు తెలిసింది. కొద్ది మంది ఎస్సైలతో మిలాఖత్‌ అయి.. వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. గత కమిషనర్‌ ఈ ఏసీపీని పలుమార్లు మందలించినట్లు సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.