- పాన్ కార్డు ఉంటేనే రుణం.. డ్వాక్రా మహిళలకు షాక్
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలోని వెలుగు అధికారులు పాన్‌కార్డుల దందాకు తెరలేపారు. డ్వాక్రా మహిళలకు రుణం కావాలి అంటే పాన్‌కార్టు తప్పనిసరి అని మనిషికి 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. గంతలో ఐడీ కార్డుకోసమని డబ్బులు వసూలు చేశారని ఇప్పటికీ ఐడీ కార్డులు తమకు అందించలేదని డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.దాచేపల్లి పట్టణ రూరల్ పరిధిలో 1600 గ్రూపులు ఉన్నాయని ఈ మేరకు సుమారు 16లక్షలు వసూలు చేస్తన్నారని డ్వాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీనే: చంద్రబాబు
తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీనే అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ఖమ్మంలో టీడీపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో పాల్గొనేందుకు బయల్దేరిన చంద్రబాబు నాయుడు కూసుమంచి మండలం కేశవాపురంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైతుల భూములుంటే.. ప్రస్తుత ధరతో, వారికే ఇచ్చేస్తా..! : మంత్రి గుమ్మనూరు
ఇట్టినా కంపెనీ నుంచి తాను కొనుగోలు చేసిన భూముల్లో రైతులవి ఉంటే.. వాటిని వాళ్ల పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయిస్తానని మంత్రి జయరాం స్పష్టం చేశారు. భూములు అమ్మిన రైతులు ఎవరైనా ఉంటే తన ఇంటికి రావాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రద్గు చేసిన 27 పథకాలపై గవర్నర్‌ను కలిసిన దళిత, గిరిజన జేఏసీ నాయకులు...
దళిత, గిరిజన జేఏసీ నాయకులు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిశారు. దళిత గిరిజనులకు చెందని 27 సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలిపిదల చేసిందని గవర్నర్‌కు ఫిర్యాదుచేశారు. ఎస్సీ,ఎస్టీల సంక్షేమ అభివృద్ది రక్షణ చట్టాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఛైర్మన్ గోపాలరావు విమర్శించారు. రాజ్యాంగబద్దంగా ఉన్న ప్రత్యేక హక్కులను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దేశంలో కొత్త కరోనా వేరియంట్.. వాటికంటే డేంజర్.. చైనాలో ఇప్పటికే విధ్వంసం..
చైనాలో కరోనా కేసుల సునామీకి కారణమైన ఒమిక్రాన్ ఉపరకం కొత్త వేరియంట్ బీఎఫ్-7 దేశంలోనూ బయటపడింది. ఇప్పటివరకు 3 కేసులు నమోదుకాగా అందులో 2గుజరాత్‌లోనే బయటపడినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఈ వేరియంట్‌కు రీ-ఇన్‌ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నీటి సంపులో పడిపోయిన బాలుడు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం
మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాలో అర్నవ్ జైన్ అనే 7 ఏళ్ల పిల్లాడు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడ్డాడు. అర్నవ్ జైన్, అతని స్నేహితుడు శ్యామ్ జైన్ కలిసి పొరుగింటి ప్రాంగణంలో ఆడుకుంటూ ఉండగా ఈ ఘటన జరిగింది. అర్నవ్ జైన్ సంపుపైకి ఎక్కి అనుకోకుండా దాని మూతపై కాలు పెట్టాడు. ఒక్కసారిగా మూత తిరగబడి అందులో పడ్డాడు. ఇది గమనించిన అతడి స్నేహితుడు శ్యామ్ జైన్ పైపును గట్టిగా పట్టుకొమ్మని సలహా ఇచ్చాడు. ఆ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రష్యా దండెత్తిన తర్వాత తొలి విదేశీ పర్యటన.. అమెరికాకు జెలెన్‌స్కీ.. వాటిపై చర్చ!
రష్యా దండెత్తిన తర్వాత తొలిసారి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అగ్రరాజ్యం అమెరికాకు బయల్దేరారు. ఈ పర్యటనలో ఆయన అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో వాషింగ్టన్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో అమెరికా నుంచి వచ్చే ఆర్థిక, ఆయుధల సాయంపై ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మస్క్ సంపద మరింత పతనం.. ఒక్కరోజే రూ.63వేల కోట్లు ఆవిరి
ఇటీవలే ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానాన్ని కోల్పోయారు ఎలాన్ మస్క్. ఆ తర్వాత ఆయన సంపద ఇంకా తరిగిపోతూనే ఉంది. మంగళవారం టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. దీంతో మస్క్ సంపదలో దాదాపు రూ.63.72 వేల కోట్లు ఆవిరయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వారెవ్వా కోహ్లీ.. డబుల్ ధమాకా.. అదరగొట్టేశావుగా
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మిజోరాం కెప్టెన్ తరువార్ కోహ్లీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. తొలుత బంతితో (4/2) ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించిన అతడు.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో (297 బంతుల్లో 203; 30 ఫోర్లు, సిక్స్) అదరగొట్టాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రభాస్‌పై నయనతార కామెంట్స్.. డార్లింగ్ అలాంటోడంటూ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై కామెంట్స్ చేసింది లేడీ సూపర్ స్టార్ నయనతార. ఏం చెప్పిందంటే.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.