ETV Bharat / state

'సాగు నీటి కోసం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలి'

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని భూములకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని స్థానిక యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు 13 గ్రామాల్లో యువకులు బైక్ ర్యాలీతో నిరసన చేపట్టారు.

youth bike rally at nandigam srikakulam district
సాగు నీటి కోసం ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలి
author img

By

Published : Oct 26, 2020, 6:33 PM IST

వర్షాలు లేకపోవడం వల్ల శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలోని కొండల ప్రాంత రైతులు కరవు కోరల్లో అల్లాడిపోతున్నారని స్థానిక యువకులు పేర్కొన్నారు. టెక్కలి, నందిగాం మండలాల్లో వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉన్నాయన్నారు. మదనగోపాల సాగరం రిజర్వాయర్- పద్మనాభ సాగరం వరకు ఉన్న భూములకు సాగునీరు అందించేందుకు ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలని యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక కాపు తెంబూరు నుంచి మదనాపురం వరకు 13 గ్రామాల్లో బైక్ ర్యాలీతో నిరసన చేపట్టారు. నినాదాలు చేశారు.

ఏటా వర్షాభావ పరిస్థితులతో పంటలు నాశనం అవుతుండడం వల్ల రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నామని పేర్కొన్నారు. అధికారులు స్పందించి ఎత్తిపోతల పథకం మంజూరు చేయాలని... సాగు నీటితో ఈ ప్రాంతాలను సస్యశామలం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:

పోలవరం ప్రాజెక్టు డ్యామ్ నిర్మాణానికి మాత్రమే నిధులిస్తాం: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.