శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస పురపాలక సంఘం ఆరో వార్డులోని ఆరు గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి మాస్కులు పంపిణీ చేయాలని సచివాలయ సిబ్బందికి వైకాపా నేతలు సూచించారు. ఈ మేరకు మాస్కులను సచివాలయ ఉద్యోగులకు స్థానిక వైకాపా నేతలు సనపల శీను, రాజు అందించారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రధాని మోదీ, సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.
ఇదీ చూడండి..