తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని రాజ్యలక్ష్మి పోల్స్ కార్మికులు.. స్పీకర్ తమ్మినేని సీతారాంకు వినతి పత్రం అందించారు. లాక్డౌన్ పేరుతో పరిశ్రమ యాజమాన్యం కార్మికులను అక్రమంగా తొలగించారని వారు వాపోయారు. కార్మిక చట్టాలు తుంగలో తొక్కుతూ.. అన్ ఫెయిర్ లేబర్ ప్రాక్టీసుకు పాల్పడుతోందని తెలిపారు. లాక్ డౌన్ కాలానికి కార్మికులందరికీ పూర్తిస్థాయి వేతనాలు చెల్లించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశించినా... యాజమాన్యం ఉద్యోగులకు, కార్మికులకు వేతనాలు చెల్లించలేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే విధంగా.., పూర్తి వేతనాలు చెల్లించేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన స్పీకర్ తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
'కార్మిక చట్టాలను కాల రాశారు..చర్యలు తీసుకోండి' - తమ్మినేని సీతారం న్యూస్
లాక్డౌన్ సమయంలో అకారణంగా తమ ఉద్యోగాలు తొలగించారని రాజ్యలక్ష్మి పోల్స్ కార్మికులు స్పీకర్ తమ్మినేని సీతారం వద్ద వాపోయారు. సరిగ్గా వేతనాలు కూడా చెల్లించటం లేదని.., తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు.