శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో రేషన్ బియ్యం అందటం లేదంటూ మహిళల ఆందోళన చేశారు. ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధిలోని కొండ పోలమ్మ కాలనీలో మూడు నెలలుగా రేషన్ బియ్యం అందటం లేదంటూ మహిళలు ఆందోళనకు దిగారు. నవంబర్లో మాత్రమే రేషన్ సరుకులు ఇచ్చారని వాపోయారు. కొండ వాళ్ళమ్మ కాలనీలో 300 మంది రేషన్ దారులు ఉండగా.. మూడు రోజుల క్రితం కేవలం ఇరవై మందికి మాత్రమే రేషన్ ఇచ్చారని తెలిపారు. మిగతా లబ్ధిదారులకు బియ్యం ఇచ్చి.. పప్పు, పంచదారను పక్కదారి పట్టించారని ఆరోపించారు. అన్ని సరుకులు ఇస్తే తీసుకుంటామని లేకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
ఇవీ చూడండి...: కొలువుదీరిన పాలకొండ నగర పంచాయతీ పాలకవర్గం