ETV Bharat / state

శ్రీకాకుళంలో మహిళలకు న్యాయ వ్యవస్థపై అవగాహన సదస్సు

జిల్లాలో న్యాయ విజ్ఞానం ద్వారా మహిళా సాధికారత అనే అంశంపై అధికారులు సదస్సు నిర్వహించారు. హిందూ వివాహ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలకు ఆస్తి హక్కు అంశాలను వివరించారు.

Women legal awareness seminar in Srikakulam
శ్రీకాకుళంలో మహిళా న్యాయ అవగాహన సదస్సు
author img

By

Published : Nov 12, 2020, 11:29 PM IST

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో న్యాయ విజ్ఞానం ద్వారా మహిళా సాధికారత అనే అంశంపై సదస్సు నిర్వహించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, జాతీయ మహిళా కమిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామకృష్ణ, కలెక్టర్‌ నివాస్​ హాజరయ్యారు.

మండల ప్రధాన కేంద్రాలు, గ్రామ స్థాయిల్లో మహిళా న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందూ వివాహ చట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, మహిళలకు ఆస్తి హక్కు అంశాలను వివరించారు. ఇళ్ల వద్దకే న్యాయాన్ని అందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

వయోలిన్ విద్వాంసుడు పొన్నాన శ్రీరాములు నాయుడు కన్నుమూత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.