ETV Bharat / state

మూడు రోజుల్లో ఒకరు తరువాత ఒకరు.. భార్య, భర్త ఆత్మహత్య

author img

By

Published : Sep 6, 2020, 9:28 AM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ పెయ్యాలవానిపేట గ్రామంలో విషాదం నెలకొంది. భార్య, భర్త మూడురోజుల్లోనే ఒకరు తరువాత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

wife and husband committed suicide  in three days  at peyyalavanipeta
మూడు రోజుల్లో ఒకరు తరువాత ఒకరు భార్య, భర్త ఆత్మహత్య

మూడు రోజుల్లో భార్య భర్తలు ఒకరు తరువాత ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీ పెయ్యాలవానిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన బోనెల హేమసుందరరావు... ఎల్ఎన్​పేట మండలం చింతలబడవంజ గ్రామానికి చెందిన శిరీష ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న సమయంలో ఇద్దరు ప్రేమించుకున్నారు. గత ఏడాది జూన్​లో ఇద్దరు వివాహం చేసుకున్నారు.ఉన్నట్టుండి ఈనెల 2న శిరీష ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తెను అత్తమామలు, భర్త హత్య చేశారని శిరీష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మూడురోజులు తిరగకుండానే భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొద్దిరోజుల వ్యవధిలో భార్య భర్తలు ఆత్మహత్య చేసుకోవడంతో ఇరుకుటుంబాల్లోనూ, గ్రామాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరువురు మృతి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని ఎస్ఐ రాజేష్ తెలిపారు.

ఇదీ చూడండి. నేల తల్లి పాన్పుగా పసికందు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.