రాష్ట్రంలో వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఏపీ ఈపీడీసీఎల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ రాజబాపయ్య చెప్పారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సోమవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజబాపయ్య పాల్గొని ప్రసంగించారు. వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా రైతులకు 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ లైన్లను అనుసంధానించామన్నారు.
ఉచిత విద్యుత్ పథకం శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని రాజబాపయ్య వివరించారు. విద్యుత్ వ్యవస్థ మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 1500 కోట్లు ఖర్చు చేయగా... అందులో ఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో 130 కోట్లు వెచ్చించామన్నారు. డిసెంబర్ నాటికి వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడతామని చెప్పారు.
ఇదీ చదవండి