రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం సరైందని ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీఉపకులపతి చలం అభిప్రాయపడ్డారు. శ్రీకాకుళంలోని ఓ పంక్షన్ హాల్‌లో మంగళవారం నిర్వహించిన అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అనే అంశంపై నిర్వహించిన చర్చావేదికకు ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణను ఆహ్వానిస్తున్నామని మేధావులు తెలిపారు. ఎప్పుడూ రాజ్యాధికారం కృష్ణానది దాటి రాలేదని గుర్తుచేశారు. ఉత్తరాంధ్రకు చాలాకాలంగా అన్యాయం జరుగుతుందని... విశాఖ రాజధానిగా మారిన తరువాత రావాల్సిన వనరులు సంపాదించుకోవాలని పలువురు సూచించారు. విశాఖకు రాజధాని వచ్చే అవకాశాన్ని జార విడుచుకోవద్దని చెప్పారు.
ఇదీ చదవండి:సమరావతి: రాజధాని రైతుల జలదిగ్బంధం