శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గ్రామ వార్డు వాలంటీర్ల సేవా సత్కార వేడుకలు నిర్వహించారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి సీదిరి అప్పల రాజు పాల్గొని సేవ పురస్కారాలు అందజేశారు. రాష్ట్రంలో గ్రామాల్లోనే ప్రభుత్వ కొనసాగాలని.. సచివాలయం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ఈ వాలంటరీ వ్యవస్థను ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారని వివరించారు. బాగా పనిచేసిన వాలంటీర్లకు సేవా పురస్కారాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇవీ చూడండి:
స్పీకర్ తమ్మినేని సభలో కలకలం.. బ్లేడ్‌తో చేతిపై కోసుకున్న వ్యక్తి