శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరాపల్లి గ్రామ సచివాలయాన్ని శుక్రవారం సంయుక్త కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయం సిబ్బందితో మాట్లాడారు. ప్రతిరోజూ ప్రజలకు 10 రకాల సేవలు అందాలని, గ్రామాల నుంచి మీ సేవ కేంద్రాలకు వెళ్లకుండా అందుబాటులో ఉండాలని సూచించారు.
మీరు ఉండి ఏం లాభం..?
సేవలు అందించకుంటే సచివాలయ సిబ్బంది ఉండి లాభమేంటని ప్రశ్నించారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పరిపాలనాధికారి తిరుపతి రావు, డిప్యూటీ తహసీల్దార్ హేమ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి