ETV Bharat / state

నరసన్నపేటలో కూరగాయల వ్యాపారాలు బంద్

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో శుక్రవారం నుంచి కూరగాయల వ్యాపారులు బంద్ పాటించారు. తరచూ దుకాణాలు మార్చటం వల్ల ఆర్థికంగా చితికి పోతున్నామని వారు వాపోయారు. అధికారులు వేధిస్తున్నారంటూ వారంతా దుకాణాలు మూసివేశారు.

srikakulam district
కూరగాయల వ్యాపారులు బంద్
author img

By

Published : Jul 10, 2020, 11:02 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కూరగాయల వ్యాపారులు బంద్ పాటించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల వ్యాపారులంతా సంఘటితంగా ఈ బంద్​లో పాల్గొన్నారు. తమను అధికారులు వేధిస్తున్నారంటూ వారంతా దుకాణాలు మూసివేశారు. ముఖ్యంగా నిరుపేద వ్యాపారులపై రెవెన్యూ, పోలీస్, గ్రామపంచాయతీ అధికారులు ప్రతాపం చూపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వ్యాపారం చేసుకోవాలని మొదట సూచించారని, ఆ తర్వాత మార్కెట్ యార్డుకు తరలి వెళ్లాలని చెప్పడంతో తాము దుకాణాలు మార్చుకున్నామని చెప్పారు.

ఇప్పుడు మళ్లీ మార్కెట్ యార్డుకు వెళ్లాలని ఆదేశించటం అన్యాయమని కూరగాయల వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ దుకాణాలు మార్చడం వల్ల ఆర్థికంగా చితికి పోతున్నామని వారు వాపోయారు. ఈ విషయంపై అధికారులు స్పందించి కూరగాయల వ్యాపారులతో చర్చించాలని అంతవరకు దుకాణాలు బంద్ పాటిస్తామని హెచ్చరించారు. కూరగాయల వ్యాపారులతో పాటు ఇతర అనుబంధ వ్యాపారాలు కూడా తమకు సంఘీభావం తెలిపారని నరసన్నపేట కూరగాయల వర్తకుల సంఘం ప్రతినిధులు వివరించారు.

ఇదీ చదవండి సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 104 ఉద్యోగుల ధర్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.