ETV Bharat / state

సిక్కోలు గడ్డపై సిరులు కురిపించనున్న వంశధార

author img

By

Published : Apr 21, 2019, 7:19 AM IST

మరికోన్ని రోజుల్లో సిక్కోలు జిల్లా వాసుల కల నెరవేరనుంది. శ్రీకాకుళం గడ్డపై సిరులు పండించే జలసిరి వంశధార ప్రాజెక్టు... త్వరలో పూర్తికానుంది. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ... 14 ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రాజెక్టు పనులు... తుదిదశకు చేరాయి. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. అనుకున్నట్లు పనులు జరిగితే... నాలుగైదు నెలల్లో ప్రాజెక్టు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు.

సిక్కోలు గడ్డపై సిరులు కురిపించనున్న వంశధార

శ్రీకాకుళం జిల్లా ప్రజల చిరకాల స్వప్నం... ఐదారు నెలల్లో సాకారం కాబోతోంది. ఈ జిల్లా వాసుల జీవనాడీ... వంశధార ప్రాజెక్టు పనులు ముగింపు దశకొచ్చాయి. ఇంకా 10 శాతమే మిగిలి ఉన్నాయి. వీలైనంత తొందరగా పెండింగ్ పనులు పూర్తి చేసి... ప్రజల కల సాకారం చేస్తామని నేతలు, అధికారులు చెబుతున్నారు.

14 ఏళ్లుగా సా...గుతున్న పనులు...
వంశధార ప్రాజెక్టు పనులు 2005లో మొదలై... 14 ఏళ్లుగా... సాగుతున్నాయి. కాని నవ్యాంధ్రలో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక... పనులు పరుగులు పెట్టాయి. నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తూనే... పనుల్లో జోరు పెంచేలా చేశారు సీఎం. ఇప్పటికే హిరమండలం వద్ద నిర్మాణంలో ఉన్న వంశధార జలాశయంలోకి 2018 స్వాతంత్ర వేడుకల సందర్భంగా... నీటిని వదిలారు. వంశధార నదిలోకి నీటి ప్రవాహం రావడంతో... వరదకాలువ ద్వారా ప్రాజెక్టులోకి వదిలారు.

వంశధార జలాశయానికి ఎగువ భాగంలో శాడిల్ డ్యామ్ నిర్మిస్తున్నారు. ఇది ప్రాజెక్టుకు అనుబంధ డ్యామ్. దీని పనులు కూడా వంశధార జలాశయం ప్యాకేజీలో అంతర్భాగం చేశారు. అనుబంధ డ్యామ్ పనులు కూడా దాదాపు 90 శాతం పూర్తయ్యాయి. కొత్తూరు మండలం ఎన్నిరామన్నపేట వద్ద సబ్సిడరీ గట్టు నిర్మించాలన్నది కూడా ప్యాకేజీలో ఒప్పందమే. కానీ ఈ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఇచ్ఛాపురంలో ఉన్న బహుదానదికి అనుసంధానం ఇక్కడి నుంచే చేయనున్నారు. కాలువ ద్వారా ఇక్కడి నుంచి నీరు తరలించే ప్లాన్ ఉండడం వల్ల సబ్సిడరీ బండ్ నిర్మాణం డిజైన్‌లో... ఏమైనా మార్పులు జరుగుతాయనే అనుమానంతో... పనులు ఇంకా ప్రారంభించలేదు.

ఒడిశాలో గతేడాది భారీ వర్షాలు కురవడంతో... వంశధార నదికి వరద పోటెత్తింది. ఆ సమయంలో కాట్రగడ వద్ద ఉన్న సైడ్‌వీయర్‌ ద్వారా నీటిని వరద కాలువ నుంచి సింగిడి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌... పారాపురం జలాశయానికీ తరలించారు. వంశధార, నాగావళి నదుల అనుసంధానం పనులు కూడా 60 శాతం పూర్తియ్యాయని అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని పనులు పూర్తిచేసుకొని జిల్లా రైతులకు వంశధార దన్నుగా నిలవనుంది.

Intro:నెల్లూరు జిల్లా వెంకటగిరిలో లో గాలి వాన సంభవించింది శనివారం రాత్రి 8 గంటల నుంచి ఒక గంట పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది ఉరుములు మెరుపులతో ఈదురు గాలులు వీయడంతో వెంకటగిరి దక్షిణ వీధి లో లో పెద్ద చెట్టు కూలి రోడ్డుపై అడ్డంగా పడింది పట్టణములోని వేలమ్మ పాలెం తదితర ప్రాంతాల్లోనూ చెట్లు విరిగిపడ్డాయి పురపాలక కమిషనర్ గంగా ప్రసాద్ యుద్ధ ప్రాతిపదికన రోడ్డుపై పడిన చెట్లను జేసీబీలతో తొలగించే చర్యలు కొనసాగించారు అర్ధరాత్రి వరకు పట్టణంలో అంధకారం తప్పలేదు బాలాయపల్లి మండలం నిడిగల్లు లో ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి

Body:v

Conclusion:v
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.