శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి పనులు జోరుగా సాగుతున్నాయి. పెద్ద ఎత్తున కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు బయలుదేరి పనులకు వెళుతున్నారు. మళ్లీ మధ్యాహ్నం 3 గంటలనుంచి 6 గంటల వరకు చెరువులు, కాలువలు తవ్వడం వంటి పనులు చేస్తున్నారు. ఎండలు మండిపోతున్నందున అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. పనిచేసే స్థలం వద్ద మంచినీరు, మజ్జిగ, మందులు, విశ్రాంతి తీసుకోవడానికి టెంట్లు అందుబాటులో ఉంచారు. దీంతో కూలీలు పనులు చేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.
ఇవీ చదవండి..