శ్రీకాకుళం జిల్లా పాతపట్నం రైల్వే వంతెన వద్ద మహేంద్రతనయ నదిలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. నది ప్రవాహంలో కొట్టుకు వచ్చిన మృతదేహంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమీపంలోని పరివాహక ఒడిశా ప్రాంతం నుంచి ఈ మృతదేహం వచ్చినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా, సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చూడండి...