Uddanam Project : శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాజెక్టులో పని చేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టారు. ప్రాజెక్టు ద్వారా సుమారు 143 గ్రామాలకు సురక్షిత త్రాగునీటిని అందిస్తున్న వీరికి.. గత 24 నెలలుగా జీతాలు అందంటం లేదని నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం స్పందించటం లేదని సమ్మెను రెండో రోజు కొనసాగించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సురక్షిత తాగునీటిని అందించేందుకు సుమారు 120 మంది కార్మికులు సేవలందిస్తున్నారు.
ఉద్దానం ప్రాజెక్టు ద్వారా తాగునీరు సరఫరా కార్మికులు.. సోంపేట బారువా జంక్షన్ వద్ద, పలాస సమీపంలో మకర జోల గ్రామం వద్ద సమ్మె శిబిరాలను ఏర్పాటు చేసి సమ్మెకు దిగారు. కరోనాలాంటి కష్టకాలంలో కూడా ప్రజలకు తాగునీటికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో సేవలు అందించామని కార్మికులు పేర్కొన్నారు. గత 24 నెలలుగా వేతనాలు అందించటం లేదని ఆందోళ వ్యక్తం చేశారు. జీతాలు అందక పోవటం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు. ప్రజాప్రతినిధులను, అధికారులను సమస్య పరిస్కరించమని కోరినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు.
తమకు ఉద్యోగ భద్రత లేదని కార్మికులు తెలిపారు. అంతేకాకుండా ఇతరత్రా ఉద్యోగ ప్రయోజనాలు లేవని అన్నారు. అలాంటిది తమకు నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అపితే.. తాము ఎలా బతకలాని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. తమకు అందాల్సిన జీతాలను పూర్తిగా అందించాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి :