శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గోపాలపురం గ్రామంలో పిడుగు పడి వృద్ధుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన ఆర్ వసంతరావు అనే వృద్ధుడు వర్షం పడుతున్న సమయంలో సమీపంలో ఉన్న పశువులశాలలో ఆవును కట్టేసేందుకు వెళ్ళాడు. అదే సమయంలో పిడుగు పడటంతో వసంతరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
ఇదీ చదవండి