బావిలో పడిన వ్యక్తిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా.. టెక్కలి సైనిక్‌నగర్ ప్రాంతంలో జరిగింది. కార్పెంటర్‌గా పనిచేస్తున్న జి.పురుషోత్తం మద్యం మత్తులో తన ఇంటి మేడ మెట్లు ఎక్కుతూ పక్కనున్న బావిలో తూలిపడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వెంటనే గుర్తించలేదు. అతడి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. టెక్కలి అగ్నిమాపక అధికారి మల్లేశ్వరరావు తన సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకుని తాళ్లు కట్టి పురుషోత్తంను బయటకు తీశారు. అతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఇదీ చూడండి. దేవరగట్టు బన్నీ ఉత్సవం రద్దు