శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలో పలు గ్రామాల అభివృద్ధి పనులకు శాసనసభాపతి తమ్మినేని సీతారాం శంకుస్థాపన చేశారు. మండలంలోని లోద్దలపేట గ్రామంలో సుమారు రూ.17.50 లక్షల నిధులతో వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రానికి, బెలమాంలో రూ.21.80 లక్షల నిధులతో రైతు భరోసా కేంద్ర నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో అవినీతికి అందనంత ఎత్తులో పాలన సాగుతోందని తమ్మినేని సీతారాం అన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని అన్నారు. పాలనను గ్రామాల్లో తీసుకురావడం వలన ప్రతి లబ్ధిదారునికి పథకాన్ని అందించడం సులభతరం అయ్యిందన్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు సమతూకంలో ఉండేవిధంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంటే.. తెదేపా నాయకులు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారని విమర్శించారు. రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టు నిర్మిస్తే.. ఈనాడు జలకళ పేరుతో జగనన్న పంపుసెట్ల ద్వారా ప్రజలకు నీరు అందిస్తున్నారని అన్నారు.
ఇదీ చదవండి: 'సీ-ప్లేన్'తో పర్యటక భారతానికి సరికొత్త కళ