శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బమ్మిడి నారాయణస్వామి బుధవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1977 నుంచి 1983 వరకు స్వతంత్ర పార్టీ తరఫున టెక్కలి ఎమ్మెల్యేగా నారాయణస్వామి సేవలు అందించారు. అనంతరం తెదేపా పార్టీ ఆవిర్భావం తరువాత రాష్ట్ర కర్షక పరిషత్తు ఛైర్మన్గా పనిచేశారు.
కొన్నాళ్లు కాంగ్రెస్లో పనిచేశాక.. కోటబొమ్మాళిలో జగన్ పాదయాత్ర నిర్వహించినప్పుడు.. వైకాపాలో చేరారు. చివరి వరకు రైతుల సమస్యలపై పోరాటాలు చేశారనీ.. నారాయణస్వామి మృతి పట్ల ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, వైకాపా నేతలు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి: