TDP Protest on removal of Flexi : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తెలుగుదేశం పార్టీ నేతల ఫ్లెక్సీల తొలగింపుతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. నూతన సంవత్సరం సందర్భంగా వైకాపా, తెదేపా నేతలు బస్టాండ్‌కు ఎదురుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పురపాలక అధికారులు తెదేపా ఫ్లెక్సీలు మాత్రమే తొలగించారు. దీంతో తెదేపా కార్యకర్తలు ఆందోళన చేశారు. తమ ఫ్లెక్సీలు తొలగించవద్దని అధికారులను కోరినప్పటికీ.. తొలగించడంతో ఆగ్రహానికి లోనయ్యారు. వైకాపా ఫ్లెక్సీలు ఎందుకు తొలగించడం లేదని వారు అధికారులను నిలదీశారు. పక్కనే ఉన్న గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఫ్లెక్సీలు మళ్లీ పునరుద్ధరించకపోతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి : వైకాపా వైరస్.. తెలుగుదేశమే వ్యాక్సిన్ : చంద్రబాబు