శ్రీకాకుళం జిల్లా(srikakulam district) పాతపట్నంలో.. శ్రీనీలమణిదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణం తొలగింపు, లక్ష్మీ గణపతి ఆలయం, ఆంజనేయ స్వామి ఆలయం తొలగింపును నిరసిస్తూ.. తెదేపా నాయకులు ఆదివారం సాయంత్రం ఆందోళన (tdp leaders concern) చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి ఆధ్వర్యంలో.. తెదేపా నేతలు కూన రవికుమార్, నరసన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తితో పాటు పలువురు ఆలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
రహదారి విస్తరణ పేరిట శతాబ్దాల చరిత్ర కలిగిన ఆలయాల తొలగింపు బాధాకరమని నేతలు అన్నారు. ఆలయాలకు ముప్పు వాటిల్లకుండా ప్రత్యామ్నాయ మార్గంలో రహదారి నిర్మించే అవకాశం ఉన్నప్పటికీ.. వైకాపా నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. కూల్చేసిన ఆలయాల నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.
పలువురిపై కేసు..
తెదేపా నాయకుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు.. నిబంధనలు అతిక్రమించారంటూ పలువురిపై కేసులు నమోదు చేశారు. తెదేపా నాయకులు కలమట వెంకటరమణమూర్తి, కోన రవికుమార్, బగ్గు రమణమూర్తి, కలమట సాగర్ తోపాటు మరో 16 మందిపై కేసునమోదు చేశారు.
ఇదీ చదవండి