తొగరాం పంచాయతీ సర్పంచి బరిలో సీతారాం సతీమణి పోటీలో నిలిచినందున అక్కడ ప్రజలను భయపెట్టి గెలవాలని చూస్తున్నారని తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్ ఆరోపించారు. మందస మండలం బహాడపల్లిలో పక్కనున్న గ్రామాల నుంచి ప్రజలను తీసుకెళ్లి ఓట్లు వేయించారన్నారు. తక్షణమే అక్కడ ఎన్నికల విధులు నిర్వహించిన అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. మూడో విడత ఎన్నికలు జరగనున్న చోట్ల ఎటువంటి అక్రమాలు జరగకుండా చూడాలన్నారు. నగర తెదేపా అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, రాష్ట్ర హస్తకళల సంస్థ మాజీ డైరెక్టర్ ఇప్పిలి తిరుమలరావు, డాక్టర్ జామి భీమశంకరరావు, కేంద్ర సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు సింతు సుధాకర్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తొలుత 12 పట్టణాల్లో మధ్య తరగతికి తక్కువ ధరలకే ఇళ్ల స్థలాలు : సీఎం జగన్