తెదేపా నేత కూన రవికుమార్ ఇంట్లో పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు చేయడాన్ని ఆ పార్టీ నేత కళా వెంకట్రావు తప్పుబట్టారు. రవికుమార్ భార్య ప్రమీలను పరామర్శించి మాట్లాడారు. వైకాపా పాలనలో హింస జరుగుతోందని ప్రజలే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిని అణిచివేస్తోందని ఆరోపించారు. రవికుమార్‌కు తెదేపా అండగా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: ఆంజనేయులు క్షేమం.. సీఎం ఇంటి వద్ద గుర్తింపు