శ్రీకాకుళంలో...
తెదేపా ఆవిర్భావ దినోత్సవాన్ని శ్రీకాకుళంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో తెదేపా కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేసారు. తెలుగువారి ఆత్మగౌరవం చాటిచెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపిన వారు... పేద ప్రజల కోసం అహర్నిశలు శ్రమించారని కొనియాడారు.
నరసన్నపేటలో...
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సీనియర్ కార్యకర్తలను సన్మానించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి... ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఇచ్చాపురంలో...
ఇచ్చాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ కూడలి వద్ద ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కంచిలి మండలం మఠం కంచిలిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్, సర్దార్ గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు.
ఇదీ చదవండి: ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు