శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస లక్ష్మణుడుపేట జంక్షన్ వద్ద పరివర్తన్ ట్రస్ట్ అధ్యక్షులు చింతా రవికుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శాసన సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. జిల్లాలోని ప్రతీ ఒక్కరు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని కోరారు.
తన జీవితంలో 28 సార్లు రక్తదానం చేశానంటూ తమ్మినేని సీతారాం తెలిపారు. ఇటువంటి శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం అందిస్తున్న పరివర్తన్ ట్రస్టు రాష్ట్ర అధ్యక్షుడు రవికుమార్‌ను అభినందించారు.
ఇదీ చదవండి: హైకోర్టులో వైద్యుడు సుధాకర్ తల్లి హెబియస్ కార్పస్