శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం గుళ్ళ సీతారాంపురం ఆలయ దుస్థితి చూసి.. విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి భావోద్వేగానికి గురయ్యారు. హిందూ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా గుళ్ళ సీతారాంపురం లోని ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి మూడు వేల ఎకరాలు భూములున్నా.. నిర్లక్ష్యానికి గురి కావడం బాధాకరమన్నారు.
ఆలయ భూముల్ని అన్యాక్రాంతం చేసిన వారే.. దోచుకున్న భూముల్ని స్వచ్ఛందంగా ఆలయానికి అప్పగించాలని కోరారు. అలాగే శ్రీరామనవమి వేడుకలకు విశాఖ శారదాపీఠం తరఫున పట్టువస్త్రాలను పంపుతామని అలయ అర్చకులకు స్వాత్మానందేంద్ర చెప్పారు.
ఇవీ చూడండి: