ETV Bharat / state

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో ఆందోళనలు

కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన సమ్మె ప్రశాంతంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

strike on srikakulam district
శ్రీకాకుళంలో సార్వత్రిక సమ్మె
author img

By

Published : Jan 8, 2020, 8:19 PM IST

కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా.. శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన సార్వత్రిక సమ్మె ప్రశాంతగా జరిగింది. న్యూ కాలనీ నుంచి జీటీరోడ్డు వరకు నిర్వహించిన ర్యాలీలో ఏపీ ఎన్జీవోలతోపాటు వామపక్షాల నేతలు పాల్గొన్నారు. ఎస్‌బీఐ మినహా మిగిలిన బ్యాంకులన్నింటిని మూసేశారు.

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ విధివిధానాలకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో సీఐటీయూ ఆధ్వర్యంలో... అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు నాగమణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రత ఏర్పాటుచేశారు.

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో కార్మిక సంఘాలు కదం తొక్కాయి. సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఇతర కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి.

శ్రీకాకుళంలో సార్వత్రిక సమ్మె

ఇవీ చదవండి..

కేంద్ర విధానాలను వ్యతిరేకిస్తూ రావులపాలెంలో బంద్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.