శ్రీకాకుళం జిల్లా రాజాంలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతంలో ఏ ప్రభుత్వం క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించలేదన్నారు. ఆ ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే చెందుతుందన్నారు. ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం క్రీడాకారులపై ఉందన్నారు . గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు.
విజేతలు వీరే
వాలీబాల్ పోటీల విజేతగా ప్రథమ స్థానం- ప్రకాశం జిల్లా. ద్వితీయ స్థానం - కృష్ణ జిల్లా. తృతీయ స్థానం- గుంటూరు జిల్లా. నాలుగో స్థానం- విశాఖపట్నం జిల్లా. బాలికల విభాగంలో..... ప్రథమ స్థానం- ప్రకాశం జిల్లా, ద్వితీయ స్థానం- కృష్ణాజిల్లా, తృతీయ స్థానం- కడప జిల్లా, నాలుగో స్థానం- విశాఖపట్నం జిల్లాలు నిలిచాయి.
ఇవీ చదవండి