కరోనాతో ఆస్పత్రిలో చేరిన యువకుడికి ముక్కు నోటి నుంచి రక్తస్రావం కావటంతో తనను వైద్య సిబ్బంది పట్టించుకోవటం లేదంటూ శ్రీకాకుళం జిల్లా జీజీహెచ్‌లో ఇటీవల సెల్ఫీ వీడియోలో వేడుకున్న పాలకొండ మండలం వెలగవాడకు చెందిన సురేష్‌కు (30) మృతి చెందాడు. 15 రోజుల కిందట వీరఘట్టం మండలం రేగులపాడులోని అత్త వారింటికి వెళ్లి జ్వరం బారిన పడ్డాడు. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చేరిన తర్వాత తనకు వైద్యం అందటం లేదని ముక్కు నుంచి నోటి నుంచి రక్తం కారుతుందని ఇక తాను బతకని అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రాధేయ పడుతూ ఓ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాల్లో ద్వారా పంపాడు. స్పందించిన అధికారులు చివరిదశలో వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. సురేష్‌కు రెండు నెలల కిందట బిడ్డ పుట్టి మృతి చెందింది. ఈ బాధలో ఉన్న కుటుంబసభ్యులకు సురేష్ మృతి తీరని దుఖాన్ని మిగిల్చింది.
సంబంధిత కథనం