శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి జడ్పీ ఉన్నత పాఠశాలలో... 63వ అంతర బాలబాలికల జోన్-3 క్రీడా పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను రాష్ట్ర రహదారులు భవనాల శాఖమంత్రి ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని మంత్రి విద్యార్థులకు వివరించారు. క్రీడల్లో రాణించి జిల్లాకు... రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లా నుంచి 8 మండలాలకు సంబంధించిన 80 పాఠశాల నుంచి 3000 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బ్యాడ్మింటన్ తదితర పోటీలు నిర్వహించారు.
ఇదీ చూడండి: బాలికలకు క్రీడలు ఎంతో అవసరం: కాటసాని రాంభూపాల్ రెడ్డి