ETV Bharat / state

కాబోయే అమ్మలకు అండగా !!

గర్భిణులకు వైద్యంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రసవానికి ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేశారు. వైద్యాధికారులకు జాబితాను అందజేశారు.

కాబోయే అమ్మలకు అండగా !!
కాబోయే అమ్మలకు అండగా !!
author img

By

Published : Mar 30, 2020, 10:25 AM IST

కరోనా వైరస్‌ ప్రబలకుండా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గర్భిణులకు వైద్యం అందించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సురక్షిత ప్రసవాలకు వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇంటి నుంచి 108, ఇతర ఏ వాహనం ద్వారా ఆసుపత్రికి వచ్చినా తక్షణం సేవలందేలా చర్యలు చేపట్టారు. ప్రసూతి గదిని, అన్ని వైద్య పరికరాలను శానిటైజర్లతో ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారు. ప్రసవమైన వెంటనే మరో ప్రసవానికి అదే గది వినియోగించాల్సి ఉన్నందున అందుబాటులో ఉన్న మూడు శస్త్రచికిత్స గదులను శానిటైజ్‌ చేసి ఉంచారు. ప్రసవించిన వెంటనే తల్లి, బిడ్డలను సురక్షితంగా సిద్ధం చేసిన ప్రత్యేక గదుల్లో ఉంచి తదుపరి వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు.

జిల్లాలో పరిస్థితి...

జిల్లాలో నెలకు 3,500 నుంచి 4000 పైచిలుకు గర్భిణులు ప్రసవం అవుతారు. ప్రస్తుతం వీరందరి జాబితాలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వైద్యాధికారులకు పంపించారు. ఇప్పటికే రెండు వేల మందికి పైగా గర్భిణులకు ప్రసవమైనట్లు సమాచారం. మిగతా వారందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు. అత్యవసర కేసులు ఏమున్నా నిర్లక్ష్యం చేయకుండా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి నేరుగా తీసుకువెళితే తక్షణ వైద్యం అందించే విధంగా ఏర్పాట్లు చేశారు.

ఓపీ నిలిపివేత...

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్టిలో పెట్టుకుని గత సోమవారం నుంచి శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో ఒ.పి. నిలిపివేశారు. ప్రతి 15 రోజులకు, వారానికి ఒకసారి వైద్య పరీక్షలకు రావాల్సిన వారికి సమీప పీహెచ్‌సీల్లో ఆరోగ్య తనిఖీలు చేయించుకోవాలని సూచించారు. ఇదే విషయాన్ని ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలకు తెలియజేశారు. అత్యవసర కేసు అయితే నేరుగా ప్రసూతి విభాగానికి తీసుకురావాలని తెలిపారు.

అప్రమత్తంగా వైద్యాధికారులు..

గర్భిణుల విషయంలో తక్షణ వైద్యం అందించే విధంగా జిల్లాలోని అందరు వైద్యాధికారులను అప్రమత్తం చేశాం. గర్భిణులు, వారి కుటుంబ సభ్యులు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదు. ప్రసవ వేదన ప్రారంభం అయితే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రులకు తీసుకువస్తే అక్కడ ఉండే సిబ్బంది తక్షణ వైద్యం అందించి సుఖప్రసవం చేయించి సురక్షితంగా ఇంటికి పంపిస్తారు.- డాక్టర్‌ ఎం.చెంచయ్య, డీఎంహెచ్‌వో

గర్భిణులు నిర్భయంగా రావొచ్చు...

ప్రసవం చేయించుకోవడానికి నిర్భయంగా సర్వజన ఆసుపత్రికి రావొచ్ఛు వారికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ప్రసవం చేయించి సురక్షితంగా ఇంటికి పంపిస్తాం. ప్రసూతి విభాగ వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఏ ఒక్కరూ ఇబ్బంది పడనవసరం లేదు. - డాక్టర్‌ వాణి, ప్రసూతి విభాగ అధిపతి

ఆసుపత్రిలో ప్రసవమే సురక్షితం..

నెలలు నిండిన గర్భిణులు ప్రసవ లక్షణాలు కనిపించగానే నేరుగా ప్రసూతి విభాగానికి వచ్చి చేరవచ్ఛు ఓపీ లేనందున ప్రసూతి విభాగం వైద్యులంతా అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లు చేశాం. ఇంటి వద్ద ప్రసవాలు చేయించుకోవడానికి ఆసక్తి చూపొద్ధు అలా చేస్తే అనుకోని ఇబ్బందులు తలెత్తవచ్చు.

- డాక్టర్‌ హేమంత్‌, ఆర్‌ఎంవో

11 మంది వైద్యులతో బృందం..

శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో 11 మంది వైద్యులతో కూడిన బృందం సిద్ధంగా ఉంది. వీరంతా గర్భిణులు రాగానే పరీక్షలు చేసి శ్వాస ఇబ్బంది, ఆయాసం, జలుబుతో ఉంటే తక్షణమే శ్వాసకోశ వ్యాధి నిపుణులను రప్పించి పరీక్షలు చేయించి వార్డులో చేర్పిస్తారు. ప్రసవ సమయం సమీపిస్తే తక్షణం ప్రసవం చేయిస్తారు. రోజులు పట్టే అవకాశం ఉంటే వెంటనే తగు సూచనలు చేసి ఇంటికి పంపిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.