శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని పలు గ్రామాల్లో కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి పర్యటించారు. అనంతరం పాతపట్నం తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి, పరీక్షలు చేయాలని ఆదేశించారు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్లో ఉంటున్నవారి వివరాలు పక్కాగా నమోదు చేయాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు కచ్చితంగా నిర్వహించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి.. తూర్పుగోదావరి జిల్లాలో నేటి కూరగాయల ధరలు