శ్రీకాకుళం జిల్లాలో క్వారంటైన్‌లో ఉన్నవారు పారిపోవడానికి ప్రయత్నిస్తే.. నోటీసులు జారీ చేస్తామని కలెక్టర్ నివాస్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ సడలింపుల అనంతరం ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు అధికం అయ్యాయన్న ఆయన... వారి నుంచి వైరస్ వ్యాప్తి చెందుతోందన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా సంస్ధాగత క్వారంటైన్ కేంద్రాలు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేసామని తెలిపారు.
జిల్లాలో 144వ సెక్షన్ అమలులో ఉందన్న కలెక్టర్.. ప్రజలు గుమిగూడవద్దని సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో విస్తృతంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశించారు. కంటైన్మెంటు జోన్లలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, కొవిడ్ లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రులకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ఇదీచదవండి. బతిమిలాడితే వైకాపాలో చేరా.. నాకు నేను వెళ్లలేదు: రఘురామకృష్ణరాజు