బాలలు ఆరోగ్యంగా ఉంటేనే.. దేశం సౌభాగ్యంగా ఉంటుందని శ్రీకాకుళం కలెక్టర్ నివాస్ అభిప్రాయపడ్డారు. జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డీ వార్మింగ్ మాత్రల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు కలెక్టర్ మాత్రలు వేశారు.
జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు 4 లక్షల 42 వేల 328 మంది ఉన్నారన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో లక్ష 52 వేల 486 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు. బడికి వెళ్లని పిల్లలు 3 వేల 2 వందల 51 మందితో కలిసి 5 లక్షల 98 వేల 65 మంది పిల్లలు ఉన్నారని వివరించారు. వీరందరికీ ఈ నెల 9 తేదీ వరకు డీవార్మింగ్ మాత్రలను వేయించనున్నట్టు తెలిపారు.
ఇదీ చదవండి: