కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతపై.. వైద్యాధికారులతో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ సమీక్ష నిర్వహించారు. వ్యాధి లక్షణాలు కలిగిన వారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. ఏమాత్రం జాప్యం చేసినా ప్రాణాలకు ముప్పు తప్పదని అన్నారు. కోవిడ్-19 కట్టడికి ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న కృషిని కొనసాగించాలని సూచించారు.
వైద్యులు ధైర్యంగా సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. నరసన్నపేటలో కరోనా వైరస్ ఎక్కువగా ఉందని గుర్తించామన్నారు. వీలైనంతవరకూ మరో 14 రోజుల పాటు జనసంచారం తగ్గించే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఇదీ చదవండి: