ETV Bharat / state

'ఆ పని చేయాలా... అనే గర్వం అంతకన్నా లేదు' - women si shireesha on Women's Day

ఆడవాళ్లు ఇళ్లకే పరిమితమవ్వాలనే మాట ఎక్కడ వినిపించినా.....మహిళా సాధికారతకు అర్థం చెబుతూనే ఉంటారు కొందరు..! ఆ అధికారిణీ ఇదే కోవలోకి వస్తారు..! ఎంచుకున్న వృత్తి, ఒంటిపై యూనిఫాం.....సగర్వంగా ప్రజాసేవలో ఉంచుతాయంటారామె..! మానవత్వంతో అనాథ శవాన్ని మోయడంలో సంతోషం వెతుక్కున్న ఆ మహిళా ఎస్సై శిరీష ... ఆకతాయిల ఆట కట్టించడంలోనూ అంతే కఠినం..! ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న ఆమెను... సోషల్ మీడియా కూడా పొగడ్తల్లో ముంచెత్తింది.

si shireesha
ఎస్సై శిరీష
author img

By

Published : Mar 8, 2021, 4:35 AM IST

మహిళా సాధికారతకు అసలైన అర్థం

కరోనా భయం లేదు.. వృద్ధుడి మృతదేహమే కదా....అని చిన్నచూపు లేదు..!. అన్నింటికీ మించి నా స్థాయికి నేను ఈ పని చేయాలా... అనే గర్వం అంతకన్నా లేదు...!. కాస్త మానవత్వం ఉంటే ఊరికి దూరంగా పడి ఉన్న మృతదేహాన్ని కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లొచ్చు..! వృత్తిపరమైన బాధ్యతతో... బంధువులకూ అప్పగించే ప్రయత్నం చేయొచ్చు..!. గత నెల్లో.. పొలం గట్లపై నడుస్తూ.. అనాథ శవాన్ని మోసిన మహిళా ఎస్సై శిరీష గురించే ఇదంతా.

నెల కిందట అడవికొత్తూరు సమీపంలోని పంటపొలాల్లో 70 ఏళ్ల యాచకుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఒంటిపై బట్టలు లేకుండా ఉన్న మృతదేహాన్ని చూసి అక్కడి నుంచి తరలించేందుకు స్థానికులు ముందుకు రాలేదు. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్న శిరీష..నడవడానికి వీల్లేని పొలం గట్లపై శవాన్ని భుజంపై 2 కిలోమీటర్ల దూరం మోశారు. బంధువులు ముందుకు రాకపోవడంతో ఓ ట్రస్టు సాయంతో అంత్యక్రియలూ నిర్వహించారు.

కరోనా కారణంగా కొన్నిచోట్ల సొంత కుటుంబీకులు చనిపోతే దరి చేరని రోజులివి..! అలాంటిది వృద్ధుడి మృతదేహాన్ని అంతదూరం ఎందుకు మోసుకెళ్లారు..? అని శిరీషను ప్రశ్నిస్తే శవమైనా, శివుడైనా ఒక్కటే అనేటంత గొప్ప పరిణితి ఆమె సొంతం..! శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ

టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా పని చేస్తున్న ఆమె...మహిళా సాధికారతకు సరైన అర్థం చెప్పారని సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. ఖాకీ దుస్తుల వెనుక దాగిన మానవత్వాన్ని ప్రపంచానికి చాటారని... ఉన్నతాధికారులు, మంత్రి సీదిరి అప్పల్రాజు... శిరీషను సన్మానించారు. ఆమె చొరవ పోలీసు శాఖకే ఆదర్శమని.... డీజీపీ గౌతం సవాంగ్ కొనియాడారు.

శిరీష తన విధుల పరిధిలో లేని పనిని కూడా మానవత్వంతో చేశారు. శిరీష చేసిన పని మెచ్చుకోదగ్గది. వృత్తిపట్ల ఆమె నిబద్ధతను.....ఈ ఒక్క ఘటన తెలియజేస్తోంది. మహిళా సాధికారతను చాటిచెప్పడానికి ఇలాంటి ఉదాహరణలెన్నో ఉన్నా... శిరీష నేపథ్యం, వృత్తిపట్ల ఆమె నిబద్ధత ప్రత్యేకం.

ఇదీ చూడండి: ఘనంగా ఆటా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.