ప్రభుత్వం ఆధీనంలో ఉన్న చెరువులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, త్వరలో వాటిల్లో ఆక్రమణలను తొలగిస్తామని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారెంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదని పేర్కొన్నారు.
ఆమదాలవలసలోని పెద్దచెరువు, కనకాద్రిచెరువు, ఊరచెరువు, బంద, తదితర చెరువులను ఆక్రమించుకున్నారని తెలిపారు. త్వరలోనే అధికారులు యంత్రాలతో వీటిని తొలగిస్తారని అన్నారు. వీటి కోసం కమిటీని వేశామని, దాని నిర్ణయం మేరకు తొలగింపు చర్యలు చేపడతామన్నారు. 14వ ఆర్ధిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆయన రూ. 50 లక్షల ప్రపంచ బ్యాంక్ నిధులతో రావికంటిపేటలోని చెరువు పూడికతీత పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిసుధాకర్, తమ్మినేని చిరంజీవినాగ్, ఇతర అధికారులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎస్ఈసీ సమావేశం..బహిష్కరించిన ప్రతిపక్షాలు