శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం పెనుబర్తి గ్రామంలో సచివాలయ పనులను సభాపతి తమ్మినేని సీతారాం శుక్రవారం పరిశీలించారు. దళ్లవలస గ్రామంలో ఇటీవల నిర్మాణం చేపట్టిన సీసీరోడ్ను ప్రారంభించారు. విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేశారు. విద్యాభివృద్ధికి సీఎం పెద్దపీట వేశారని స్పీకర్ అన్నారు. నాడు-నేడు పనుల ద్వారా ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దిన ఘనత వైకాపా ప్రభుత్వం దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.