శ్రీకాకుళం జిల్లా సోంపేట దుర్ఘటనకు నేటికి పదేళ్లు. పర్యావరణ పరిరక్షణకు ప్రాణాల్నే పణంగా పెట్టిన రైతులు, మత్స్యకారుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు ఆ ప్రాంత ప్రజలు. పోలీసుల కాల్పుల్లో మరణించిన రైతులకు శ్రద్ధాంజలి ఘటించారు. విశిష్ట చిత్తడినేలలుగా గుర్తింపు పొందిన సోంపేటలో.. 2007లో అప్పటి ప్రభుత్వం బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయించింది. జీవ వైవిధ్యం కలిగిన చిత్తడి నేలలపై... వీటి చుట్టూ ఉన్న 33 గ్రామాల ప్రజలు ఆధారపడి జీవించేవారు.
థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తే తమ బతుకులు ధ్వంసం అవుతాయని మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు బాలగోపాల్ ఆధ్వర్యంలో ప్రజలు ఉద్యమించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా పాలకులు 2011లో విద్యుత్ కేంద్రానికి శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారు. రైతులు, మత్స్యకారులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో పోలీసులు, గ్రామస్థులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ముగ్గురు రైతులు మరణించారు. ఈ సంఘటన జరిగిన నేటకి పదేళ్లు అయ్యింది. ఆ దుర్ఘటనను గుర్తుచేసుకుంటూ....స్థానికులు అమరస్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఇదీ చదవండి: