శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో శ్రీ నీలమణి దుర్గ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. పాతపట్నంలో ఎక్కువగా కరోనా పాజిటివ్ ఫలితాలు రావటంతో మంగళవారం జరగాల్సిన ఆవేటి వారాలు.. ఆలయం వద్ద జరుపకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పాతపట్నంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చిన భక్తులను ఎస్ఐ టి.రాజేష్ ఆధ్వర్యంలో వెనక్కి పంపించారు. స్థానిక ప్రజలు ఇంటివద్ద పూజలు చేసుకోవాలని పంచాయతీ కార్యదర్శి టి. హరికృష్ణ సూచించారు.
ఇదీ చదవండి 'తెదేపా హయాంలో డీడీలు కట్టిన లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలి'