ETV Bharat / state

"కీర్తికుమార్​​పై పెట్టిన కేసును ఎత్తివేయాలి"

టెక్కలి ‘న్యూస్‌టుడే’ కంట్రిబ్యూటర్‌ వట్టికూళ్ల కీర్తికుమార్‌పై పెట్టిన కేసును తక్షణం ఎత్తివేయాలని సంతబొమ్మాళి ప్రెస్​క్లబ్ గౌరవాధ్యక్షుడు కర్రిశంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సంతబొమ్మాళి తహసీల్దార్​కు, డీఎస్పీ వినతిపత్రాలను అందజేేశారు.

author img

By

Published : Jan 23, 2021, 2:26 PM IST

తహసీల్దార్​కు వినతి పత్రం అందజేస్తున్న ప్రెస్​క్లబ్ అధ్యక్షులు

శ్రీకాకుళం జిల్లా టెక్కలి ‘న్యూస్‌టుడే’ కంట్రిబ్యూటర్‌ వట్టికూళ్ల కీర్తికుమార్‌పై పోలీసులు పెట్టిన కేసును ఎత్తివేయాలని సంతబొమ్మాళి ప్రెస్​క్లబ్ గౌరవాధ్యక్షుడు కర్రి శంకర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే కేసు పెట్టారని అయన మండిపడ్డారు. సంతబొమ్మాళి పాలేశ్వరస్వామి ఆలయంలో నందివిగ్రహం తొలగింపు ఘటనతో గానీ, ఆ ప్రాంతంతో గానీ సంబంధం లేని కీర్తికుమార్‌పై కేసు నమోదు చేయడాన్ని ఖండించారు.

ఇది పత్రికా స్వేచ్ఛపై దాడేనని.... ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ధోరణి సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతబొమ్మాళి తహసీల్దార్‌ ఎస్‌.రాంబాబు, డీఎస్పీ శివరామిరెడ్డి, ఎస్సై గోవింద్‌లకు శుక్రవారం వినతిపత్రాలు అందజేశారు. పోలీసు వ్యవస్థ, ప్రభుత్వం ఆలోచించి, కేసును వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి సంతోష్, పాత్రికేయులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.